ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మాసబ్ ట్యాంక్ లోని డైన్ హాల్ రెస్టారెంట్ ను పరిశీలించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. హోటల్ కిచెన్ లో వినియోగిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు మేయర్.. తిని మిగిలిపోయిన మటన్ బొక్కలకు అంటుకుని ఉన్న మాంసాన్ని సపరేట్ చేస్తున్నారు హోటల్ నిర్వాహకులు. దాంతో హోటల్ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు మేయర్.
అయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు ఫుడ్ ఇన్ఫెక్షన్ వార్తలు నా దృష్టికి వచ్చాయి అని తెలిపిన మేయర్… అందుకే ఫుడ్ సేఫ్టీ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి నేరుగా తనిఖీలకు వచ్చాను. చాలా వరకు హోటల్ అన్ హైజెనిక్ గా హోటల్స్ నిర్వహిస్తున్నారు. కిచెన్ లో కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదు. ఉడికించిన చికెన్ ను ఫ్రిజ్ లో పెట్టు రోజుల తరబడి వినియోగిస్తున్నారు. డ్రైనేజీ సింక్ పక్కనే వండడం., చేతులకు ఎలాంటి గ్లౌజులు వాడకుండా నేరుగా చేతులతో తాకడం గమనించాం. నిబంధనలు ఉల్లనగించిన హోటల్స్ పై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని మేయర్ పేర్కొన్నారు.