Medico Preethi Case : కాకతీయ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్నం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్..చోటు చేసుకుంది. మెడికో ప్రీతి సూసైడ్ కేసులో నిందితుడు సైఫ్ పై విధించిన సస్పెన్షన్ ను హైకోర్టు ఆదేశాలతో ప్రిన్సిపల్ తాత్కాలికంగా ఎత్తివేశారు.
సైఫ్ వేధింపులతో FEB 22 వ తేదీన కాకతీయ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయగా, 26న మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో సైఫ్ పై కాలేజీ ఏడాది నిషేధం విధించగా, తన వివరణ తీసుకోకుండానే చర్యలు తీసుకున్నారని అతను కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం క్లాసులకు అనుమతించాలని, వారం తర్వాత వివరణ తీసుకోవాలని కోర్టు సూచించింది. ఇక కాకతీయ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసు గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.