బీఆర్ఎస్ పార్టీలో YSRTP విలీనం

-

BRS పార్టీలో YSRTP పార్టీ విలీనం ఐంది. YSRTP పార్టీ నుంచి గట్టు రాంచందర్ రావు అధ్వర్యంలో ముఖ్య నాయకులు, అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వైయస్ఆర్టిపి పార్టీని బిఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలికారు మంత్రి హరీష్ రావు.

Merger of YSRTP into BRS party

ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వాళ్లు పార్టీ పెట్టగలుగుతారా పార్టీ నడపగలుగుతారా తెలంగాణ వాళ్లకు అంత సీను ఉందా అనే అవహేళన మాటలు ఎన్నో విన్నామని గుర్తు చేశారు.ఇలాంటి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 14 సంవత్సరాలు పార్టీని నిలబెట్టి, రాష్ట్ర సాధన కోసం చావు అంచుల వరకు వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ అని కొనియాడారు.

సమైక్య నాయకులు పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టడం కాదు అని అవహేళన చేశారని ఫైర్ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ చీకటి మయమైతుందని చెప్పారు. ఆయనలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే లాగా ఈరోజు రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపాడు మన కెసిఆర్ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news