ఆరడుగుల హరీష్ రావు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే అని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. హరీష్ రావు, కేసీఆర్ సంతకాలు పెట్టి తెలంగాణ నీటి వాటాను తాకట్టు పెట్టడం వల్లే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం అన్నారు. హరీష్ రావు చేతకానితనం వల్లే బనకచర్ల నిర్మిస్తున్నారు… కేసీఆర్ మంచితనం గురించి లోకేష్ మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.

మీరు తాకట్టు పెట్టిన నీటిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. కవిత ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలియదని పేర్కొన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీసీ రిజర్వేషన్ల అంశం తెరమీదికి వచ్చినప్పుడు కవిత జైలులో ఉన్నారు… మేము బీసీ బిల్లు కోసం కొట్లాడితే క్రెడిట్ ఆమెకి దక్కాలని చూస్తోందని మండిపడ్డారు. ఆమె జెండా మారింది, రంగు మారిందని చెప్పారు.