హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అలాగే కమిషనర్ ఆమ్రపాలిని తాజాగా కలిసారి ఎంఐఎం కార్పొరేటర్లు. హైడ్రా పై మేయర్, కమిషనర్ కు ఫిర్యాధు చేశారు MIM కార్పొరేటర్లు. హైడ్రాను రద్దు చేయాలని మేయర్, కమిషనర్ కు ఇచ్చిన వినతి పత్రంలో కార్పొరేటర్లు పేర్కొన్నారు. హైడ్రా కు GHMC తో సంబంధం లేకుండా తీర్మానం చేయాలని 7 మంది MIM స్టానింగ్ సభ్యులు కోరారు.
GHMC యాక్ట్ లో హైడ్రా లేదు… అయినా కూడా హైడ్రా వింగ్ కోసం GHMC యంత్రాంగాన్ని వాడుతున్నారు అని కార్పొరేటర్లు మేయర్, కమిషనర్ కు తెలిపారు. హైడ్రా ను తెచ్చి GHMC పై రుద్దడం కరెక్ట్ కాదు అని.. GHMC యాక్ట్ లో ఇలాంటి వ్యవస్థ లేదు అని పేర్కొన్నారు. అందువల్ల ఈ విషయం పై వెంటనే పాలక మండలిలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలి అని MIM కార్పొరేటర్లు మేయర్, కమిషనర్ లకు తెలియజేసారు.