AIMIM పార్టీపై బీజేపీ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుతో AIMIM పార్టీ ఒక నేర సంస్థగా మారిందని బిజెపి ఆరోపించింది. ఇది ఓల్డ్ సిటీని నిర్వీర్యం చేస్తుందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా సృష్టించిన ఈ గజిబిజిని తొలగించడానికి ఇదే సరైన సమయమని ప్రజలకు సూచించింది.
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం వస్తే అక్బరుద్దీన్ చేసిన ఈ చర్యకు బుల్డోజర్ రియాక్షన్ ఉంటుందని ట్వీట్ చేసింది. కాగా, ఓ సభలో అక్బరుద్దీన్ పోలీసులను బెదిరించిన వీడియో వైరల్ అవుతుంది.
కాగా, HYD పోలీసులకు అక్బరుద్దీన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రయానగుట్ట నియోజకవర్గం సంతోష్ నగర్ పిఎస్ పరిధిలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న ప్రచారం నిర్వహించారు. ఇంతలో అక్కడికి వచ్చిన సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ పి. శివచంద్ర ప్రచార సమయం అయిపోయింది. ఇక ప్రసంగం ముగించాలని అక్బరుద్దీన్ ఓవైసీకి చెప్పారు. దీంతో ఒక్కసారిగా అక్బరుద్దీన్ కు కోపం వచ్చింది. ప్రచార సమయానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందని, ముందే ప్రచారాన్ని ఎలా ఆపుతారంటూ ఇన్స్పెక్టర్ కన్నెర్ర చేశారు.