బోరంచ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేసారు మంత్రి దామోదర రాజనర్సింహ. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొన్ని కీలక కామెంట్స్ చేసారు. గత పదేళ్ల BRS పాలన ఏకపక్షంగా నియంతృత్వంగా కొనసాగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్షానికి కూడా స్వేచ్ఛ ఇచ్చింది అని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కాకముందే ప్రభుత్వం పనులు చేయట్లేదని విమర్శలు చేస్తున్నారు. 75 శాతం రైతులకు రుణమాఫీ అయ్యింది.. మిగిలిన 25 శాతం మందికి త్వరలోనే రుణమాఫీ చేసి తీరుతాం అని భరోసా ఇచ్చారు.
అలాగే ఈ దామోదర రాజనర్సింహ ఎప్పుడు రియల్ ఎస్టేట్ చేయలేదు అని పేర్కొన మంత్రి.. JNTU తెచ్చిన పక్కన నాకు ఎకరం భూమి లేదు, సింగూరు కాలువల కింద నా భూమి లేదు. నేను ఏం చేసినా ఆందోల్ నియోజకవర్గ ప్రజల కోసమే. అయితే అందరూ రాజకీయ నేతల్లా నేను ఎవరి పైన వ్యక్తిగత విమర్శలు చేయను అని మంత్రి పేర్కొన్నారు.