పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో ఘోర ఓటమిని చవిచూశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు పై కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు.
వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన ఎర్రబెల్లి దయాకర్ రావును యశస్విని ఓడించడం సంచలనంగా మారింది. అటు నిర్మల్ నియోజకవర్గంలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఓటమి చెందారు.