దీపంలాంటి కేసీఆర్ ఉండగా.. పాపం లాంటి బీజేపీ ఎందుకు : మంత్రి హరీశ్ రావు

-

బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టాలంటుంది.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుంది అంటున్నాడని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాత్రం మూడు పంటలు సాగు చేయాలంటున్నారని.. ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఇవాళ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం, భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. 

దీపం లాంటి కేసీఆర్ ఉండగా.. పాపం లాంటి బీజేపీ ఎందుకు, శాపం లాంటి కాంగ్రెస్ ఎందుకు అని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లులు బలంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్స్ తీసుకొచ్చాం. నాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30 శాతం అయితే.. నేడు 72.8 శాతం జరుగుతున్నాయని తెలిపారు. బిడ్డ కడుపులో పడినప్పటి నుంచే న్యూట్రిషన్ కిట్స్, బిడ్డ పుడితే కేసీఆర్ కట్స్ అందజేస్తున్నామని తెలిపారు. మహిళల సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రారంభించారన్నారు. తల్లికి పాలు, కోడిగుడ్డుతో భోజనం పెట్టే ఆరోగ్యలక్ష్మీ, ఉచితంగా గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లే అమ్మఒడి వాహనాలను ప్రారంభించినట్టు తెలిపారు.

అదేవిధంగా మహిళలకు తాగునీటి కష్టాలు లేకుండా చేశారన్నారు. వీఏఓలను నాటి ప్రభుత్వాలు గుర్తించలేదన్నారు. రెన్యువల్ ఆటోమేటిక్ చేయాలని.. ఇన్సూరెన్స్ చేయాలని, వేతనం పెంచాలనే కోరికలు వారంలో పరిష్కరిస్తామన్నారు. వీరితో పాటు ఆర్పీల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని ఆదేశించారని.. వారం రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని చెప్పుకొచ్చారు మంత్రి హరీశ్ రావు. 

 

Read more RELATED
Recommended to you

Latest news