ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్‌ కేసీఆర్‌దే : మంత్రి హరీశ్ రావు

-

తెలంగాణలో ఎన్నికల హడావుడి షురూ అయింది. ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారం మొదలుపెట్టారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మూడోసారి కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఓరుగల్లులో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ములుగు మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్ని ట్రిక్కులు చేసినా.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్​ను ఎవరూ ఆపలేరని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. గ్యారెంటీ లేని కాంగ్రెస్.. గ్యారెంట్ కార్డు ఇస్తానంటోందని ఆక్షేపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో ఆరుగురు ముఖ్యమంత్రులు మారతారని అన్నారు. అధికార యావ కల్గిన కాంగ్రెస్‌ నేతలు ఇవాళ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని రేపు రాష్ట్రాన్నే అమ్మేస్తారని విమర్శించారు.

కేసీఆర్ హయంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిచిందని హరీశ్‌ రావు అన్నారు. తొమ్మిదేళ్లలో 29 వైద్య కళాశాలలు నిర్మించిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. దేశంలో ఎక్కడా జిల్లా కో వైద్య కళాశాల లేదని చెప్పారు. దక్షిణ భారత దేశానికే తెలంగాణ ధాన్యాగారంగా నిలిచిందని హరీశ్‌రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version