హాఫ్ మారథాన్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

-

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హాఫ్ మారథాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఊపి హాఫ్ మారథాన్ ను ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు. ఈ హాఫ్ మారథాన్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికైనా సిద్దిపేటలో హాఫ్ మారథాన్ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.

మూడు ఫార్మాట్లలో జరిగే ఈ రన్ కి దాదాపు 4 వేల మంది రన్నర్స్ వచ్చారన్నారు. ఇకపై ప్రతి యేటా సిద్దిపేటలో హాఫ్ మారథాన్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక ఈ హాఫ్ మారథాన్ బ్రాండ్ అంబాసిడర్లు హైదరాబాద్ నుంచి రన్నింగ్ చేసుకుంటూ తాడూరి శ్రీకాంత్, సైకిల్ పై వచ్చిన డాక్టర్ నాగలక్ష్మి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version