కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. ఈ రోజు వచ్చి అమిత్ షా వచ్చి తిడుతారు, రేపు ఖర్గే వచ్చి తిడుతారు.. వాళ్ళది తిట్లలో పోటీ, మనది కిట్లలో పోటీ.. కాంగ్రెస్‌ది బట్ట కాల్చి మీద వేసే సంస్కృతి.. కాంగ్రెస్ పార్టీది తన్నుల సంస్కృతి, బీఆర్ఎస్ పార్టీది టన్నుల పంట పండించే సంస్కృతి.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలిచినప్పటి నుంచి అందుబాటులో లేడు.. ఆయన అడ్రస్ లేడు, ఎక్కడున్నాడో తెలియదు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీశ్ రావు.
నియోజకవర్గ ప్రజలకు ఫోన్ నెంబర్ తెలియని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని హరీశ్ దుయ్యబట్టారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిందేమి లేదని.. కాంగ్రెస్‌వి వట్టి మాటలేని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సర్కార్ చేతల ప్రభుత్వమని.. ఆయన పక్కా హిందూ అని హరీశ్ స్పష్టం చేశారు. కేసీఆర్ కుల మతాలకు అతీతంగా పనిచేశాడని, కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.