చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

-

చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమన్నారు.  పాపం ఈ వయస్సులో ఆయన అరెస్ట్ మంచిది కాదని వ్యాఖ్యానించారు. గతంలో ఐటీ ఐటీ అని చెప్పిన చంద్రబాబు.. ఇటీవల ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనవచ్చని పేర్కొన్నారు. ఈ వయస్సులో చంద్రబాబు అరెస్ట్ అంత మంచిది కాదన్నారు. ఇప్పుడు చాలా మంచి మాట చెప్పారు. కేసీఆర్ పాలన బాగుంది కాబట్టే చంద్రబాబు అలా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కేసీఆర్ పూర్తి చేశారు. కేసీఆర్ లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయ్యేదా అని ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు. 

 కొద్దిరోజుల కిందట చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన హరీష్ రావు.. అసలు చంద్రబాబు అరెస్ట్‌తో తమకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఈ అరెస్ట్ ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతోన్న గొడవ అని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పుకొచ్చారు. మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ జరుగుతోందని అన్నారు.చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఏపీకి సంబంధించినదని, తమకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై ధర్నాలు చేయాల్సింది అక్కడ.. కానీ హైదరాబాద్‌లో ర్యాలీలు తీస్తున్నారని అన్నారు. పక్కింట్లో పంచాయతీని ఇక్కడ తీర్చుకుంటారా అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు

Read more RELATED
Recommended to you

Exit mobile version