తెలంగాణ బంగారు పళ్లెం కాదు.. అప్పుల కుప్పగా ఉంది : మంత్రి జూపల్లి

-

ప్రజల్లో తిరుగుబాటు వచ్చే బీఆర్ఎస్ను ఓడించారని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్కు ప్రజలు వాత పెట్టి 2 నెలలు కూడా కాలేదన్నారు. 2018 ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ చాలా హామీలు ఇచ్చి.. వాటిని అమలు చేయలేదని అందుకే ప్రజలు వారిని ఓడించారని పేర్కొన్నారు. గతంలో విపక్షాలు బీఆర్ఎస్ను రెండేళ్ల తర్వాత విమర్శిస్తే… రెండేళ్ల పసికందును విమర్శిస్తున్నారు అని వాపోయారని.. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ నేతలు రెండు నెలలు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారంటూ మంత్రి జూపల్లి ధ్వజమెత్తారు.

“తెలంగాణ రాష్ట్రం బంగారుపళ్లెం కాదు.. అప్పుల కుప్పగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో జీవోలను బహిర్గతం చేయలేదు. అన్నీ చీకటి జీవోలు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేసింది. ఇవాళ రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోంది. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. రాష్ట్రానికి పెట్టుబడుల కోసమే అదానీని సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. గత రెండేళ్లలో కృష్ణా బేసిన్‌లో నిండుగా నీరు ఉన్నప్పటికీ సాగుకు నీరు ఇవ్వలేదు. ఈ ఏడాది వర్షాలు లేక నాగార్జునసాగర్‌లో జలాలు అడుగంటి పోయాయి. కృష్ణా బేసిన్‌లో నీరు లేనప్పుడు రెండో పంటకు నీరు ఇవ్వటంఎలా సాధ్యం. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల్లో అప్పుడే రెండింటిని అమలు చేసింది. మిగతా గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాం.” అని జూపల్లి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news