వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ హామీ అమలు : మంత్రి కోమటిరెడ్డి

-

కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అయితే ఉచిత విద్యుత్పై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ హామీ అమలు చేయనున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.

హామీల అమలుపై అధికారులతో సమీక్షించామని, ఆరు గ్యారంటీలను కచ్చితంగా వంద రోజుల్లోగా అమలు చేసి తీరతామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ సర్కారు నిర్వాకం వల్ల రాష్ట్రం అప్పులపాలైందని అందుకే హామీల అమల్లో కాస్త జాప్యం అవుతోందని తెలిపారు. ప్రతి హామీకీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్‌ కూడా బీఆర్ఎస్ పార్టీలాగా ప్రజలను రెచ్చగొట్టి ఉంటే కేసీఆర్‌ ఫాంహౌస్‌ దాటే పరిస్థితి ఉండేది కాదని మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటూ రాదని జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news