మూసి ప్రక్షాళన హర్శించలేని మూర్ఖుడు కేటీఆర్ : మంత్రి కోమటిరెడ్డి

-

నల్గొండకు పైనా ఫ్లోరిన్.. కింద మూసి. కానీ ఇప్పుడు నల్గొండకు సీఎం రేవంత్ రెడ్డి ఆశా కిరణం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీఎం అయిన రెండు రోజుల నుండే మూసి గురించి మాట్లాడారు. పుట్టిన రోజు మూసి దగ్గర చేసుకుంటున్నాడు. కానీ ఆ మూసి ప్రక్షాళన హర్శించలేని మూర్ఖులు కేటీఆర్. హరీష్ నాటకాలు చూసి మన శ్రీకాంత్ చారి చనిపోయాడు. అగ్గిపెట్టె దొరకలేదు అని మోసం చేశావు. ఈ సారి బుల్డోజర్ కింద పడుకుంటాఅంటున్నాడు. కానీ అగ్గిపెట్టె దొరకనట్టు కాదు..ఈ సారి బుల్డోజర్ కింద పడుకుంటే పైనుండి పోనిస్తం.

అయితే ఫ్లోరైడ్ ఇంకా జిల్లాలో పోలేదు. Slbc పూర్తి కాకపోతే సిఎం 6 వేల కోట్లు మంజూరు చేశారు. యోగ చేసి పాదయాత్ర చేస్తా అంటున్నావు. పాదయాత్ర కాదు. మొకాళ్ళ యాత్ర చేసినా నమ్మరు. పదేళ్లలో మూసి శుభ్రం చేయని బతుకు.. ఓ బతుకా. ఐదేళ్లు సీఎంగా రేవంత్ ఉంటారు. తర్వాత ఎన్నికలు వస్తాయి. మళ్ళీ రేవంత్ సీఎం అవుతారు. అప్పటికి మూసి పూర్తి అవుతుంది అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version