కాంబోడియాలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఉద్యోగాల పేరుతో తెలంగాణ యువకులను కంబోడియా తీసుకెళ్తున్న ముఠా.. పాస్ పోర్ట్ లు లాక్కుని చిత్రహింసలు పెట్టి యువకుల ద్వారా సైబర్ క్రైం చేయిస్తుంది. బంధీగా ఉన్న యువకుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. కాంబోడియా నుంచి తల్లిని సురక్షితంగా హైదారాబాద్ తీసుకొచ్చారు సైబర్ క్రైమ్ పోలీసులు.
ముఠ లోని కీలక సభ్యుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సదాకత్ ఖాన్ ను అరెస్ట్ చేసారు. ఇక మాల్దీవుల నుంచి తిరిగి వస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో సుధాకత్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని పై 7/2024, U/s 370, 386, 420, 323, 342 r/w 120-B IPC & సెక్షన్ 24 ఎమిగ్రేషన్ చట్టం కింద కేసులు నమోదు చేసారు.. సూదాకత్ కు సహకరిస్తున్న మరో ముగ్గురు ఏజెంట్లు కూడా అరెస్ట్ చేసారు. జగిత్యాల్‌కు చెందిన కె. సాయి ప్రసాద్, పూణెకు చెందిన మహ్మద్ అబిద్ హుస్సేన్ అన్సారీ, బీహార్‌కు చెందిన మహ్మద్ షాదాబ్ ఆలం ను అరెస్ట్ చేసారు పోలీసులు.