సభకు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు వదులుకున్నట్లే..!

-

రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్ష నాయకుడు కుడా అంతే అని KCR ను ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సభకు హాజరుకాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించనట్టే. దేశంలో అర్ధరాత్రి వరకు సభ నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే. 83 ఏండ్ల ఖర్గే, ఆరోగ్యం బాగాలేకపోయినా సోనియా పార్లమెంటుకు హాజరవుతున్నారు. అలాంటిది కేసీఆర్ కు ఏమైంది.. సభకు ఎందుకు హాజరవ్వడం లేదు అని ప్రశ్నించిన కోమటిరెడ్డి.. సభకు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు వదులుకున్నట్లే అని పేర్కొన్నారు.

అలాగే కాంగ్రెస్ 2వసారి మళ్ళీ ప్రభుత్వ ఏర్పటు చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మీద హరీష్ రావుకి, కేటీఆర్ కి నమ్మకం లేదు. రేవంత్ ఆధ్వర్యంలో మేము ఎన్నికలకు వెళ్ళాము అధికారం లోకి వచ్చాము. సభలో మీకు మేము చాలు అంటున్న కేటీఆర్, హరీష్ ఎన్నికల్లో రేవంత్ ని ఎందుకు ఓడించలేదు అని అన్నారు. మేము దింపిన బుల్లెట్ కేసీఆర్ కి దిగింది… సీఎం సీటు పోయింది. కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఏ క్షణమైనా బీజేపీ లో బీఆర్ఎస్ ను విలీనం చేసేటట్టు ఉన్నాడు. త్వరలోనే మరికొంతమంది బీఆర్ఎస్ MLA లు మా పార్టీలోకి వస్తున్నారు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version