BRS పార్టీపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విరుచుకపడుతున్నారు. అది రావుల పార్టీ నా.. రేవ్ పార్టీ నో వాళ్ళకే తెలియాలి. మేము విద్యుత్ చార్జీలు పెంచుతాం అన్నట్టు… BRS ఆందోళన చేసి తగ్గించినట్టు సంబరాలు అంటా అని ఎద్దేవా చేసారు మంత్రి. BRS వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో.. నేదుకు చేస్తారో వాళ్ళకే అర్థం కావడం లేదు. కానీ త్వరలో 20 మంది MLAలు కాంగ్రెస్ లో చేరతారు అని కోమటి రెడ్డి తెలిపారు.
అసలు BRS నాయకులు విద్యుత్ పోరాటం ఎప్పుడు చేశారు.. వెళ్లి కేసినో ఆడుకోండి అని మంత్రి అన్నారు. అయినా టానిక్ శాప్ పెట్టీ అమ్ముకున్నాడు కదా.. టానిక్ శాప్ కేటీఆర్ దే.. ఆయన బామ్మర్ది బినామీ. ఇందులో రేపో మాపో అరెస్టులు ఉంటాయి. ప్రస్తుతం కేటీఆర్ బామ్మర్ది నీ దాచి పెట్టాడు. కానీ ఏ తప్పు చేయకపోతే దాయడం ఎందుకు.. కోర్టుకు వెళ్ళడం ఎందుకు అని మంత్రి కోమటి రెడ్డి ప్రశ్నించారు.