మంత్రి గారూ… ‘డబుల్ డెక్కర్’ మళ్ళీ తీసుకొద్దామా…? కేటిఅర్ ఆసక్తికర ట్వీట్…!

-

డబుల్ డెక్కర్ బస్… హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వారికి బాగా గుర్తు ఉండేది డబుల్ డెక్కర్ బస్. అయితే ఇప్పుడు ఇది హైదరాబాద్ లో కనపడటం లేదు. అయితే ఈ విషయాన్ని మంత్రి కేటిఅర్ దృష్టికి ఒక ట్విట్టర్ యూజర్ తీసుకొచ్చారు. కేటిఅర్ గారూ… ఈ బస్సు చూడండి అంటూ బస్ ఫోటో పెట్టారు. జూ పార్క్ నుంచి సికింద్రాబాద్ వరకు… అఫ్జల్ గంజ్ హైకోర్ట్ మీదుగా దీనిని సిటి హైడ్ టూరిస్ట్ లేదా పబ్లిక్ బస్ గా మళ్ళీ ప్రారంభించండి అని ట్వీట్ చేసారు.

దీనిని చూసిన కేటిఆర్… అబిడ్స్‌ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌కు వెళ్లేటప్పుడు డబుల్ డెక్కర్ బస్సులో వెళ్ళిన జ్ఞాపకాలు నాకు చాలా ఉన్నాయి. వాటిని ఎందుకు తీసేసారో తెలియదు… రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ గారూ… వాటిని మళ్ళీ తిరిగి తీసుకు రావడానికి ఏదైనా అవకాశం ఉందా…? అని ట్వీట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news