ఆయన మళ్ళీ సిఎం అయ్యే ఛాన్స్ లేదు, ఇదే లాస్ట్: ఎంపీ వార్నింగ్

లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ శనివారం మాట్లాడుతూ నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని పేర్కొన్నారు. 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోజు రాష్ట్రం మూడవ మరియు చివరి దశ పోలింగ్‌లో జరుగుతుంది. ఇందులో భాగంగా 2.35 కోట్లు  మంది ఓటర్లు 1,204 మంది అభ్యర్థుల భవిష్యత్తు నిర్ణయిస్తారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా ఎల్జెపి పోటీ చేస్తూ… సిఎం ని టార్గెట్ చేస్తుంది. “బీహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్” తో ప్రజలు కనెక్ట్ అయ్యే విధానం బాగుంది అన్నారు. “మా పనితీరు బాగుంటుందని నేను నమ్ముతున్నాను. ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది, నితీష్ కుమార్ జి ఇంకెప్పుడు సిఎం అవ్వడు “అని పాస్వాన్ ధీమా వ్యక్తం చేసారు. ఈ నెల 10న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.