కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్టుంది ధరణీ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీలో ధరణీ గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ధరణీని 2014లో కేసీఆర్ తీసుకొచ్చారు. ఐఎల్ఎఫ్ కి అప్పగించారు. ధరణీతో సామాన్యులు అవస్థలు పడ్డారు. ధరణీ వచ్చిన తరువాత ప్రతీ గ్రామంలో సమస్యలు వచ్చాయి.
ధరణీ పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం. ధరణీ సమస్యలతో రైతులు రోడ్డున పడ్డారు. చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా వారి సమస్యలు పరిష్కారం కాలేదు. సాదా బైనామాలకు నోటిఫికేషన్ ఇచ్చి ధరణీలో ఆ కాలమే పెట్టలేదు. ధరణఈతో కేసీఆర్ ప్రజలను దగా చేశారు. ధరణీతో దాదాపు 18లక్షల ఎకరాల భూమిని పక్కకు పెట్టారని తెలిపారు మంత్రి పొంగులేటి. భూములమ్ముకున్న వారికి పట్టాలు ఇచ్చారు. కొన్నవారు మాత్రం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.