కాంగ్రెస్ వాపును చూసి బలుపు అనుకుంటుంది – మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు బిఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ వాపును చూసి బలుపు అనుకుంటుందని విమర్శించారు. నేడు హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిన సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ కావాలనే డిమాండ్ పెరుగుతుందని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీల వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని ప్రశ్నించారు. బిజెపి అంటేనే బడా జూట పార్టీ అని.. ఆ పార్టీలో అధ్యక్షుడి నుండి ప్రతి ఒక్కరూ అబద్ధాలే చెబుతుంటారని దుయ్యబట్టారు. తెలంగాణపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. రైతులు, పేదలు రెండు కళ్ళుగా కేసీఆర్ పాలన కొనసాగుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version