మూసీ ప్రక్షాళనకు ఇజ్రాయెల్ పరిజ్ణానం : శ్రీధర్ బాబు

-

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ణానం అందించడానికి ఇజ్రాయెల్ సంసిద్ధత వ్యక్తం పట్ల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేసారు. సచివాలయంలో తనను కలిసిన ఆ దేశపు రాయభారి రువెన్ అజర్ కు ఆయన ఈమేరకు కృతజ్ణతలు తెలిపారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఇజ్రాయెల్ ఎంతో ఆసక్తి కనబర్చడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

కృత్రిమ మేథ, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణాకు సహకరించాలని శ్రీధర్ బాబు కోరారు. డిఫెన్స్, వ్యవసాయం, నీటి వినియోగంలో ఆధునిక సాంకేతికత, నూతన పరిశోధనలు, పారిశ్రామిక అభివృద్ధిలో తోడ్పాడునందించాలని మంత్రి చేసిన అభ్యర్థనకు రువెన్ అజర్ సానుకూలంగా స్పందించారు. వ్యర్థ జలాల పునర్వినియోగ సాంకేతికలో తమకు సహకరించాలని శ్రీధర్ బాబు కోరారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసామని ఇజ్రాయెల్ దేశం ఏ పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చినా నైపుణ్యం కలిగిన మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news