కరీంనగర్ జిల్లా.. అల్గునూర్ లో దీక్షా దీవస్ సభలో కేటిఆర్ కీలక కామెంట్స్ చేసారు. తెలంగాణ కు పునఃర్జన్మనిచ్చీంది కరీంనగర్. ఇక్కడి ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదు. 1956 నుంచి 1968వరకు తెలంగాణ కు అన్యాయం జరిగింది. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యింది. తొలిదశ ఉద్యమంలో 370 మంది బలిదానం అయ్యారు. 1971 నుంచి 30 ఏళ్ళ పాటు మేధావులు ఉద్యమకారులు ఎదురు చూశారు అప్పుడే కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చిండు కేసీఆర్. కరీంనగర్ సింహగర్జన తో ఉద్యమబాట పట్టాడు. పదవులు త్యాగం చేసి 2001లో టిఆర్ఎస్ ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారు.
2001 నుంచి 2014 వరకు ప్రజా ఉద్యమం సాగించారు. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంతో విధిలేని పరిస్థితుల్లో అనాడు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చింది. రాష్ట్రం సాధించిన ఘనత కేసిఆర్, తెలంగాణ ప్రజలకు దక్కుతుంది సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసిఆర్ అడుక్కునే పరీస్థితి అంటుండు నేడు గద్ధెనెక్కినోడు. కేసీఆర్ కాలి గోరుకు సరిపోడు. ఎక్కడికైనా పోదాం.. ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలు చెబుతారు. దమ్ముంటే రా.. పోదాం ఎక్కడికైనా. ఏదో సాధించినట్లు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు లేకుండా పోతే వీపు చింతపండు చేసే పరిస్థితి ఉంది. ఐదేళ్ళ కాంగ్రెస్ పాలన కర్కశత్వం వల్ల వందల మంది ఆత్మబలిదానం చేశారు. బలిదానాలు ఆపడానికి అనేక రకాల పోరాటం చేశాం. మరోసారి పోరాట బాట పట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉంది. దీక్షా దీవస్ స్పూర్తిగా కేసిఆర్ దీక్ష స్పూర్తితో పోరుబాట పోరాడుదాం. ఎక్కడికక్కడ పోరాటం స్పూర్తి నింపుదాం అని కేటీఆర్ పేర్కొన్నారు.