రేపు ఉదయం వరకు గణపతులు నిమజ్జనం కొనసాగుతుందని పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ చార్మినార్ వద్ద మీడియాతో తలసాని మాట్లాడుతూ… నిమజ్జనం సాఫీగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసాం.. నిమజ్జన కార్యక్రమం సవ్యంగా సాగుతోందన్నారు. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని షెడ్యూల్ ప్రకారమే నిమజ్జనం చేస్తున్నామని చెప్పారు.
బాలాపూర్ గణనాథుడు మధ్యాహ్నం వరకు చార్మినార్ కు చేరుకునే అవకాశం ఉందన్నారు. రేపు ఉదయం వరకు నిమజ్జనం కొనసాగుతుంది..నిమజ్జన సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనం చూడడానికి లక్షలాదిమంది తరలివస్తున్నారని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుకు తగినట్లు ఏర్పాటు చేశామని వివరించారు. వినాయక శోభాయాత్రను సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిరక్షిస్తున్నామని.. గణనాథులను త్వరగా నిమజ్జనం అయ్యేలా చూడడం మా ఉద్దేశం కాదు.ఎవరు ఎప్పుడు వచ్చినా నిమజ్జనం చేసుకోవచ్చన్నారు తలసాని.