ఆకట్టుకోని “చంద్రముఖి – 2″…. వారిద్దరి యాక్షన్ కు ఫ్యాన్స్ ఫిదా !

-

ఎన్నో అంచనాలతో ఈ రోజు థియేటర్లలో చంద్రముఖి 2 సినిమా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. పి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాఘవ లారెన్స్ మరియు కంగనా రనౌత్ ప్రధాన పాత్రలలో నటించారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. రజినికాంత్ నటించిన చంద్రముఖి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా అదే స్థాయిలో హిట్ సాధింస్తుందని అంతా అనుకున్నారు. కానీ కథ విషయంలో చంద్రముఖి ని ఫాలో అయినా కథనం విషయంలో ఈసారి వాసు తడబడ్డాడు అని తెలుస్తోంది. ఒక హారర్ సినిమాలో ఏమైతే ఉండాలో ఏవ్ ప్రధానంగా మిస్ అయ్యాయి. ఇక ఈ సినిమా మొత్తానికి కూడా వేటయ్య రాజుగా రాఘవ లారెన్స్ మరియు చంద్రముఖి గా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లు నటన పరంగా ఆకట్టుకున్నారు.

వీరి నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫైనల్ గా చెప్పుకోవాలంటే కొత్తదనం లేని కథ, స్లో నరేషన్ , కామెడీ ఫెయిల్ కావడం మరియు హారర్ ఎలిమెంట్స్ లో లోపం ఉండడం తో సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version