ఏ రాష్ట్రం పూర్తిగా రుణమాఫీ చేయలేదని తాజాగా మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పై రాజకీయ నాయకులు, రైతాంగం మీద అభిమానం ఉన్న నాయకులు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. రుణమాఫీ గురించి కొన్ని కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు వాస్తవం కాదు. గతంలో నాలుగు విడుతలుగా రుణమాఫీ చేశారు. దీంతో రైతుకు ఉపయోగపడలేదు. రుణమాఫీ సక్రమంగా జరగలేదనే భావన రైతాంగంలో ఉంది. అలా కాకుండా మా ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేసింది.
గత ప్రభుత్వం 2018లోనే రుణమాఫీ చేస్తానని చెప్పింది. కానీ 2023 వరకు రుణమాఫీ చేయలేదు. ఎన్నికల ముందు భూములు అమ్మేసీ రుణమాఫీ చేశారు. కేవలం ఎన్నికల ముందు మాత్రమే రుణమాఫీ చేసింది. ఏ రాష్ట్రం పూర్తిగా రుణమాఫీ చేయలేదు. వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ఇచ్చిన వాగ్దానం మేరకు ఇప్పటికే రెండు విడుతల్లో రుణమాఫీ చేశాం. మూడో విడుత ఆగస్టు 15లోపు చేస్తామని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.