భద్రాచలం రామచంద్రుడు సాక్షిగా రుణమాఫీ వాగ్దానం నెరవేర్చాం : మంత్రి తుమ్మల

-

గత నలభై ఏళ్లుగా ఇల్లందు నియోజక వర్గంతో నాకు అనుబంధం ఉంది. ఆదివాసీలు గిరిజనులు ఎక్కువగా ఉన్న భద్రాచలం పినపాక ఇల్లందు నియోజక వర్గాల్లో ఎక్కువ సమయం కేటాయించా అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎర్ర బస్సు కరెంట్ బల్బు చూడని గుండాల ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు తో ప్రగతి బాట పట్టించా. ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడ్డా.. రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తాం అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

దేశం లో ఎక్కడా లేని విధంగా 18 వేలు కోట్లు రుణమాఫీ చేశాం. రెండు లక్షల పైన రుణమాఫీ ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తాం. భద్రాచలం శ్రీ రామచంద్రుడు సాక్షిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన రుణమాఫీ వాగ్దానం నెరవేర్చాం. అధిక వర్షాలు వల్ల పత్తి దిగుబడులు తగ్గాయి గిట్టుబాటు వచ్చేలా సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ఉంటాయి. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు లాభాలు వచ్చాయి. కాబట్టి పత్తి సాగుతో నష్టపోకుండా ఆయిల్ పామ్ సాగు ఇల్లందు నియోజక వర్గంలో చేపట్టాలి అని మంత్రి తుమ్మల సలహా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news