బావ బామ్మర్దుల పోటీపడి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే సెంచరీ కొడతారట. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెండుసార్లు కర్రుగాల్సి వాతపెట్టారు..17 ఎంపీ స్థానాల్లో ఒక్క సీటు గెలవని మీరు ఏడు స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైన మీరు.. రేపు అసెంబ్లీ ఎన్నికలు పెడితే 100 సీట్లు గెలుస్తారట పగటి కలలు కంటున్నారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అయితే ఈ బావ బామ్మర్దులు బయలుదేరారు పాదయాత్ర చేస్తారట. పది సంవత్సరాలు పరిపాలన చేసిన మీ నాయన మీరు ఏ ఒక్కరోజు ప్రజల మధ్యకు రాలే నాలుగు గోడల మధ్యనుండే పరిపాలన కొనసాగించారు.
అయితే మీరొక్కసారి తెలంగాణ రాష్ట్రం తిరగడమే మంచిది మీ 10 సంవత్సరాల పాలన ఎలా ఉందో తెలుస్తుంది. ప్రజల కష్టాలు తెలుస్తాయి.. కాంగ్రెస్ పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా మీ పాదయాత్రని స్వాగతిస్తున్నాం అని పేర్కొన్నారు. అలాగే ఏదైతే తెలంగాణ ప్రజల సొమ్ము లక్ష కోట్ల పైన మీరు దోచుకున్నారో ఆ సొమ్మును ప్రతి గ్రామ పంచాయతీకి రేష్యో ప్రకారం పంచాలని బావా బామ్మర్దులకు తెలియజేస్తున్నాం అని అన్నారు మంత్రి పొంగులేటి.