ఖమ్మం జిల్లాలో మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం : మంత్రి తుమ్మల

-

45 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను పడిన అవమానాలు చెప్పదలుచుకున్నానంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. శ్రీరాముడు, ఖమ్మం జిల్లా ప్రజల దయవల్ల ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. ఎన్టీఆర్‌ కాలం నుంచి మంత్రిగా ఉంటూ జిల్లాకు మేలు చేయడానికి ప్రయత్నించానని చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచే గోదావరి పారుతున్నా.. ఆ జలాలు ఈ నేలను పూర్తిగా తడపలేదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలనేది తన సంకల్పమని చెప్పుకొచ్చారు.

‘నేను మంత్రిగా ఉన్న ప్రతిసారి సీఎంలతో మాట్లాడి నా ప్రయత్నాలు చేశాను. సత్తుపల్లి, జూలూరుపాడు, వేలేరు ప్రాంతాలకు కూడా నీళ్లు ఇవ్వాలని కోరాను. ఖమ్మం జిల్లా రైతులకు నీళ్ల కోసమే గతంలో పార్టీ మారాను. గత ప్రభుత్వం పలు ప్రాజెక్టుల పనులను పట్టించుకోలేదు. రాహుల్‌గాంధీ కోరిక మేరకు ఈసారి కాంగ్రెస్‌లోకి వచ్చాను. కాంగ్రెస్‌లోకి వచ్చేటప్పుడు కూడా ప్రాజెక్టులు పూర్తి చేయాలని అడిగాను. మంత్రిని కాగానే సత్తుపల్లి టన్నెల్‌కు పనులు ప్రారంభించాను’. అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news