నిజమైన రైతులకు రైతుభరోసా అందాలి : మంత్రి తుమ్మల

-

ఖమ్మం జిల్లా నుంచి రైతుభరోసా సదస్సులకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లో రైతుభరోసా విధివిధానాలపై అభిప్రాయాల సేకరించినట్లు తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అభిప్రాయాలు సేకరణ జరిగిందని వెల్లడించారు. ప్రజల ఆలోచనల మేరకు ప్రభుత్వం ముందుకెళ్తుందని తుమ్మల పేర్కొన్నారు. నిజమైన రైతులకు రైతుభరోసా అందాలన్న మంత్రి.. గతంలో జరిగిన ఆర్థిక నష్టాన్ని ప్రజలు గమనించారని వ్యాఖ్యానించారు. చిన్న, సన్నకారు రైతులకు చేయూత నిచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. రైతుల అభిప్రాయాల సేకరణ తర్వాతే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని చెప్పారు.

ఉమ్మడి జిల్లాల్లో రైతుభరోసా వర్క్‌షాప్‌లు ఇవాళ ప్రారంభమయ్యాయి, ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామన్న ఆయన.. రైతులు పెద్దఎత్తున ఆధారపడిన సాగు రంగాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతుభరోసా ఇస్తామని చెప్పామని.. రైతుభరోసా అమలు చేయాలనే దృఢసంకల్పంతో ఉన్నామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news