సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రానికి చేరుకున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి. మోతే నుంచి మునగాల మండలం మొద్దుల చెరువు వరకు నిర్మించనున్న ఆర్&బీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు మంత్రి ఉత్తమ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ కీలక కామెంట్స్ చేసారు. కాళేశ్వరం నీళ్లు లేకుండానే అధిక సాగు వచ్చింది ఆయన అన్నారు. ఈ సీజన్ లో రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు అయ్యింది అని తెలిపారు. రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది అని పేర్కొన్నారు.
అయితే ఇక పై హాస్టల్ మెస్, డైట్ చార్జీలు పెంచనున్నట్లు తెలిపిన మంత్రి ఉత్తమ్.. ఏడాదిలోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అని అన్నారు. ఈ ఏడాదిలో కోదాడకు 400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టం. అలాగే ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందించనున్నాం అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.