రియల్టర్లతో పాటు నిర్మాణాదారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. పాలనాపరమైన అభివృద్ధి ఇకపై సులభతరం. ఇప్పటికే అనుమతులు పొందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. క్రేడాయి & ట్రెడాలు ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. సమస్యల పరిష్కారానికి కమిటీతో చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది.
ఈ అభివృద్ధిలో రియల్టర్లు, బిల్డర్లు భాగస్వామ్యం కావాలి. అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి స్పష్టత ఉంది. హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ లో 10,000 కోట్లు కేటాయించారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో నగరాభివృద్ధికి శ్రీకారం చుట్టాం. రీజినల్ రింగ్ రోడ్ తో పాటు కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నం. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు, మెట్రో విస్తరణ వేగవంతం అవుతుంది. పరిశీలనలో త్రాగునీటి సామర్ధ్యం పెంచే అంశం ఉంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.