బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల ఛిన్నాభిన్నం : మంత్రి ఉత్తమ్

-

గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆ శాఖ ప్రస్తుత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయల ధనం వృథా చేశారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని సీతారామ, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టులను గురువారం ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా ములకలపల్లిలోని పంప్‌హౌస్‌-3లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్​పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. రూ.2,654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులను సీతారామ, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టులుగా రీడిజైన్‌ చేయటంతో సుమారు రూ.20 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు. గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలను సస్యశ్యామలం చేయటమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూర్‌ లింక్‌ కెనాల్‌ నిర్మాణానికి స్థలం సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి ఏన్కూర్‌ లింక్‌ కెనాల్‌ పనులను పూర్తి చేసి 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news