ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అకాల వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ధాన్యం తడిసి ముద్దయిన సంగతి తెలిసిందే. ఈ తడిచిన ధాన్యం పై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా ప్రాంతాల్లో వర్షం తడిసి పోయిందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా పంట నష్టం జరిగితే.. కొన్ని చోట్ల మోతాదులో పంటలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు మంత్రి కుమార్ రెడ్డి.
తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని కూడా కీలక ప్రకటన చేశారు. తరుగు తీస్తే.. కఠిన చర్యలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడైనా రైతులకు ఇబ్బంది ఉంటే తమ వద్దకు సమాచారం అందించాలని కూడా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ మంచి పథకమని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు సన్నబియ్యం ఇవ్వడం లేదని నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చేవి దొడ్డుబియ్యం మాత్రమేనని.. తెలంగాణ మాత్రమే సన్నబియ్యం ఇస్తుందని స్పష్టం చేశారు.