సొంత జిల్లా శ్రీకాకుళం అభివృద్ధి చెందకపోవడం పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. వనరులు ఉన్నా ఉద్యమాలతో కొందరూ అడ్డుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనా ప్రాజెక్టు చేపడుతామంటే జెండాలు తీసుకొని వచ్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టు నిర్మాణం చేపడుతామంటే వద్దంటున్నారని.. పాజిటివ్ మైండ్ లేదని మండిపడ్డాయి. పాజిటివ్ గా ఆలోచించకపోతే మరో 75 ఏళ్లు అయినా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందదు అన్నారు.
శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. పీ4 విధానం పై అవగాహన లేకపోవడం వల్లనే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. పేదలు ఆర్థికంగా ఎదుగుతారనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు పీ4 విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. పేదలు ఆర్థికంగా ఎదుగుతారనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు పీ4 విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. ధనవంతులు సాయం చేస్తే.. ఆర్థికంగా పేదలకు చాలా ఉపయోగపడుతుందన్నారు.