GHMC కౌన్సిల్ సమావేశానికి హాజరైన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

-

తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి. ఎప్పుడు ఎవ్వరూ ఏ పార్టీలో చేరుతారో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ బీఆర్ఎస్ హయాంలో విజయం సాధించి మేయర్ అయిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తండ్రి కేశవరావుతో పాటు కూతురు విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాణం పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

తాజాగా జరిగిన  GHMC కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీకి 2:3 మెజారిటీ లేకుండా సింగిల్ గా కండువాలు కప్పి చేర్చుకుంటున్నారని పేర్కొన్నారు.  సరైన మెజారిటీ లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా పార్టీలో చేర్చుకోవడం వల్ల ఈరోజు కౌన్సిల్లో గందరగోళం నెలకొంది.మాకు ఎవరూ టచ్ లో లేరు.. చేర్చుకునే ఆలోచన మాకు లేదు.  జిహెచ్ఎంసి లో సమస్యలు పెరిగిపోయాయి. కౌన్సిల్ పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్తులో మరి దారుణంగా తయారు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version