రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మంత్రి అకస్మిక తనిఖీ

-

హైదరాబాద్ సనత్ నగర్ లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అకస్మిక తనిఖీ చేట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతీ సెక్షన్ కలియ తిరిగి ఫైళ్లను పరిశీలించారు. అధికారుల నుంచి వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్ లో నమోదు అయిన వివరాలతో కూడిన హాజరు పట్టికను పరిశీలించి కార్యాలయంలో ఎంత మంది పని చేస్తున్నారు. ఎవరెవరు లీవ్ లో ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.

ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడం.. నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టారీతిన వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం కాలుష్య నివారణ, నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో చేపడుతున్న పరిశోధనలు, చర్యల పురోగతిని  మంత్రి అధికారులు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేయకూడదని.. సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ.. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం సూచించిన మార్గ దర్శకాలను విస్తృతంగా అమలు పరచాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ లో తాను ఎప్పుడూ తనిఖీ నిర్వహించినా అధికారులు, సిబ్బంది అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని మంత్రి సురేఖ సూచించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version