72వ మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఫెమినా మిస్ ఇండియా-2023 విజేత రాజస్థాన్ చెందిన నందిని గుప్త నిన్న హైదరాబాద్ కి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా మిస్ ఇండియా నందిని గుప్తా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరుడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఆమె దేవాలయం ప్రత్యేకత, విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు గుడి ప్రాంగణంలో ఆమె ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆదివారం తన ఇన్ స్టాగ్రామ్ పేజీ, మిస్ ఇండియా ఖాతాల ద్వారా పంచుకున్నారు.
హైదరాబాద్ కి నా ఒక్క రోజు ప్రయాణం కేవలం యాదృశ్చికంగా జరుగలేదు. ధన్యవాదాలు పరమేశ్వరుడా.. నన్ను మార్గ నిర్దేవం చేసినందుకు ఇది నిజం ఓ పిలుపు.. అద్భుతమైన స్థలాన్ని సందర్శించినందుకు నేను ఎంతగానో కృతజ్ఞతతో ఉన్నాను. రామప్ప ఆలయంలో భారతీయ శిల్పకల, శతాబ్దాల క్రితం చేసిన అద్భుతమైన సాంకేతికత చూసి ఆశ్చర్యపోవాల్సిందే.