హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి అదృశ్యం విషాదాంతం

-

హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి కార్తీక్(21) మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. కార్తీక్ ఏపీలోని విశాఖపట్నంలో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి మృతదేహాన్ని గుర్తించి విశాఖ కేజీహెచ్​కు తరలించారు. కార్తీక్ స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఐఐటీ హైదరాబాద్‌లో రెండో సంవత్సరం చదువుతున్న కార్తిక్‌.. ఈనెల 17వ తేదీన ఐఐటీ క్యాంపస్‌ నుంచి బయటకెళ్లాడు.

అప్పటి నుంచి అటు క్యాంపస్​కు తిరిగి వెళ్లకపోవడంతో క్యాంపస్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ ఇంటికి కూడా రాకపోవడంతో తమ కుమారుడు అదృశ్యమయ్యాడని అర్థమైన తల్లిదండ్రులు అతడికి ఫోన చేశారు. ఎన్నిసార్లు చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత వారం రోజులుగా సంగారెడ్డి పోలీసులు కార్తీక్ కోసం రాష్ట్రమంతటా గాలిస్తున్నారు.

చివరకు అతడి సెల్​ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడి తల్లిదండ్రులను ఏపీలోని విశాఖకు తీసుకెళ్లారు. అక్కడ సముద్రం వద్ద సిగ్నల్స్ చూపించగా.. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించి కార్తీక్ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్నారు. వెంటనే అతడి మృతదేహం కోసం గాలింపు చేపట్టి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే కార్తీక్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news