వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థం మాధవి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి మంత్రి కేటీఆర్ ను హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసిన నేపథ్యంలో రాజరాజేశ్వరస్వామివారి టెంపుల్ నుంచి రూ.5 కోట్ల నిధులను కామారెడ్డి జిల్లాకు తరలించే ప్రక్రియని నిలుపుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోరగా.. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి నిధుల మల్లింపును నిలిపి వేశారని. ఈమేరకు ఎమ్మెల్యే రమేష్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి వున్నామని, ప్రస్తుతం రూ. 67 కోట్లతో బద్ధి పోచమ్మ టెంపుల్, బండ్ సుందరీకరణ, ఆలయ వసతి గదుల నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఆలయ చెరువుకు, పుష్కరిణికి, పట్టణ రోడ్లకు సుమారుగా రూ.190 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్ వేములవాడ పర్యటన సందర్భంగా సమగ్రమైన ప్రణాళికా నిధులపైన ప్రకటన ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పేర్కొన్నారు.