హరీష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే సింగూరు జలాలని సంగరెడ్డి ప్రజలకు కాకుండా తరలించుకుపోతున్నారని ఈ విషయంలో హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన జగ్గారెడ్డి తాజాగా కొత్త స్వరం అందుకున్నారు. కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు. తనకు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ప్రగతిభవన్ ముందు ధర్నా చేస్తానంటూ సంచలనం సృష్టిస్తున్నారు. తనని కలిసేందుకు అవకాశం ఇచ్చే వరకు ధర్నా చేస్తూనే వుంటానని జగ్గారెడ్డి స్వరం పెంచారు.
ఇంతకీ జగ్గారెడ్డి సీఎం అపాయింట్మెంట్ కోరుతున్నది సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యల్ని వివరించడానికా లేక తన పొలిటికల్ కెరీర్, రాజకీయ అవసరాల కోసమేనా? అన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం జగ్గారెడ్డి తీరు ఎంతకీ అంతుచిక్కడం లేదట. అయితే ఇదంతా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం జగ్గారెడ్డి తీరుకు తెగ నవ్వుకుంటూనే ఆయన బాధేందో జర సూడుండి సారూ అని కేసీఆర్‌ని కోరుతున్నారట. భలే చిత్రంగా వుంది కదూ జగ్గారెడ్డి వింత కథ.