రేవంత్ రెడ్డికి మేమే ఎక్కువ : కౌశిక్ రెడ్డి

-

రేవంత్ రెడ్డి పాలనపై రైతులు తిరగబడుతున్నారు అని హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతులు తిరగబడి కలెక్టర్‌ ను ఉరికించింది విషయం తెలిసిందే. కలెక్టర్‌ తో పాటుగా మిగిలిన అధికారుల వాహనాలపై రైతులు దాడి చేయగా.. మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే హుజురాబాద్ లో అర్హులకు అందరికి దళిత బంధు ఇవ్వకపోతే ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది అని హెచ్చరించిన కౌశిక్ రెడ్డి.. రేవంత్ రెడ్డి పై రైతులు తిరగబడితే ఏ పోలీసు కాపాడలేడు అని అన్నారు.

ఒక సీఎం హోదాలో ఉండి ఎటువంటి భాష మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి గమనించుకోవాలి. అలంటి మాటలు మేము కూడా మాట్లాడగలం అని చెప్పిన కౌశిక్ రెడ్డి.. నీకు కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు అవసరం లేదు.. నీకు మేమే ఎక్కువ అన్నారు. అలాగే ప్రస్తుతం రేవంత్ రెడ్డి మీద సమాజం తూ అని ఉస్తుంది అంటూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version