కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కులగణన సర్వే చేయటానికి వచ్చిన అధికారులకు ఆయన షాక్ ఇచ్చారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి BRS ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడినా ఆ వీడియోను అధికారులకు చూపించి ఇప్పుడు ఎమోహంతో రేవంత్ రెడ్డి సర్వె చేపడుతున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్యే.
రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు అంతస్తులు వాహనాలు తదితర స్థిర చర ఆస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని నిలదీశారు. గడువులోపు సర్వే పూర్తీ చేయాలనే ఆతృతలో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని పేద, బడుగు, బలహీనర్గాలతో పాటు మైనారిటీలు, అగ్రవర్ణాల పేదలకు కూడా సరైన న్యాయం దక్కేలా వివరాలు నమోదు చేయాలని కోరారు ఎమ్మెల్యే. మొదట ప్రజాప్రతినిధుల వివరాలు సేకరిచే కంటే ప్రజల వివరాలు సేకరించాలని సూచించారు. అలాగే ప్రజలకు సర్వే పేరిట అన్యాయం జరిగితే BRS పార్టీ చూస్తూ ఊరుకోదు అని ఎమ్మెల్యే హెచ్చరించారు.