నా భార్య , మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు – పాడి కౌశిక్ రెడ్డి

-

నా భార్య , మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడని బాంబు పేల్చారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా, రాత్రి 2 గంటలకు మై హోమ్ భుజాలో ఏ హీరోయిన్ దగ్గరకి పోతున్నావో అందరికి తెలుసు అని ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

kaushik
kaushikBRS MLA Kaushik Reddy comments on revanth reddy

రేవంత్ రెడ్డి నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లనే నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఎవరెవరితో తిరిగావో ఆ 16 మంది పేర్లు బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు. నువ్వు జూబ్లీహిల్స్‌లో ఎక్కడ పడుకున్నావో, దుబాయిలో ఎక్కడ పడుకున్నావో, ఢిల్లీలో ఎక్కడ పడుకున్నావో నాకు అన్నీ తెలుసు అన్నారు. రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిండు…. ఇవి ఆరోపణలు కాదు వాస్తవాలు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news