NTR, చంద్రబాబు, KCRకు వెన్నుపోటు పోడిసిన వ్యక్తి కడియం శ్రీహరి అని.. కడియం శ్రీహరి పార్టీ మారే కుట్ర 3 నెలల నుంచే జరుగుతోందని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి మూడు నెలల నుండి కుట్ర పన్నాడు….ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ ను కడియం శ్రీహరే ఎళ్లగొట్టాడని ఆగ్రహించారు. ఘన్పూర్ ప్రజలకు నేను అందుబాటులో నేను అండగా ఉంటానని… NTR, చంద్రబాబు నాయుడు, KCR కు వెన్నుపోటు పోడిచిన వ్యక్తి కడియం శ్రీహరి అంటూ నిప్పులు చెరిగారు.

MLA Palla Rajeshwar Reddy serious on kadiyam srihari
కావ్య మా నాన్న బ్రాండ్ అటుంది… వెన్నుపోటు పొడవడంలో బ్రండా? కడియం లాంటి ద్రోహులను ప్రజలు క్షమించరని హెచ్చరించారు. కడియం… సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చెయ్యి అంటూ డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి, కావ్య ఎక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తామమని… ఘన్పూర్ ప్రజలకు ఏ పనైనా నేను సేవా చేస్తానన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.