రేవంత్ రెడ్డి వ్యూహం బెడిసికొట్టింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ను బలవంతంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని చూశారట రేవంత్ రెడ్డి. కార్యకర్తలతో సమావేశం అనంతరం పార్టీలో చేరట్లేదని ప్రకటించారు ప్రకాష్ గౌడ్.
అంతేకాదు… చేవెళ్ల పార్లమెంటరీ నాయకులతో మీటింగులో పాల్గొన్న ప్రకాష్ గౌడ్…బీఆర్‌ఎస్ పార్టీ గెలుపు కోసం కృష్టి చేస్తానని ప్రకటించారు. కాగా నిన్న ఉదయం తన కేడర్‌తో సమావేశమైన ప్రకాష్ గౌడ్… కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు.
ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్‌కు సూచించారు పలువురు నేతలు. దీంతో తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై విరమించుకొని, వెనకడుగు వేసుకున్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.