TDP: ఇవాళ అభ్యర్థులకు బీ-ఫారాలు ఇవ్వనున్న చంద్రబాబు..చింతమనేనికి నో ఛాన్స్

-

ఇవాళ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు ఇవ్వనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కొన్ని సెగ్మెంట్లల్లో అభ్యర్థిత్వాల మార్పుపై తర్జన భర్జనలో ఉంది టీడీపీ. కొలిక్కి రాని సీట్లల్లోని అభ్యర్థులకు బీ-ఫారాల జారీని పెండింగులో పెట్టే ఛాన్స్ ఉంది. బీ-ఫారం తీసుకోవడానికి రావొద్దని చింతమనేనికి సమాచారం ఇచ్చారట.
రెండు రోజుల క్రితం బీ-ఫారం తీసుకోవడానికి రావాలని చింతమనేనికి సూచనలు చేశారు.

Chandrababu chintamaneni

చివరి నిమిషంలో దెందులూరు టిక్కెట్టుపై ట్విస్ట్ నెలకొంది. రేపు నామినేషన్ వేయడానికి సిద్దపడుతున్నారు చింతమనేని. బీజేపీతో అనపర్తి సీట్ ఎడ్జస్ట్మెంటులో భాగంగా దెందులూరు విషయమై టీడీపీ కసరత్తు చేస్తోంది. మడకశిర, ఉండి, పాడేరు, సుళ్లూరుపేట, మాడుగుల వంటి సెగ్మెంట్లల్లో అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version