పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలి. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వెళుతారు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మహిళ అని క్లయిమ్ చేస్తున్నప్పుడు గౌరవంగా ఉండాలి కదా ..పార్టీ మారి ఉండాల్సింది కాదు కదా. ఎల్ఓపి సభకు రాకపోవడం తో ఆ పార్టీ నేతలు తల్లి లేని పిల్లలుగా అనిపిస్తుంది. ఎల్ఓపి హరీష్ , కేటిఆర్ ఇద్దరిట్లో ఎవరికి ఇచ్చిన పార్టీ ఆగం అవుతది. హరీష్ రావు వర్కర్ ..కానీ ఆయనకు ఇవ్వరు. ఇక KCR లేకపోవడం వల్ల హౌస్ లో కిక్కు లేదు. KCR వస్తే ఆ మజా వస్తది అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
తప్పుడు నిర్ణయాలు తీసుకున్న KCR సభలో ఉంటే సమాధానం చెప్పేవాడు. నిర్ణయాలు తీసుకున్న KCR లేనప్పుడు సభలో ఎన్ని మాట్లాడిన సంవాదం ఉండదు. పవర్ మీద డిస్కషన్ లో కేసిఆర్ ఉండి ఉంటే ఇంకా బాగా జరిగేది. KCR ఓడిపోయిన ఇంకా జాతిపిత అనుకుంటున్నాడు. BRS అధికారంలో ఉన్న పదేళ్లు BRS ఎమ్మెల్యేలు KCR ను జాతిపిత అని పొగిడి.. ఆయనను ఆకాశం లో కూర్చ బెట్టారు. కానీ ఇప్పుడు అధికారం పోయిన KCR ఇంకా అదే ఊహల్లో ఉన్నాడు అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.